Saturday, January 18, 2025
Homeసినిమాఅయ్యో పాపం .. అనన్య 

అయ్యో పాపం .. అనన్య 

ఒక సినిమా హిట్ అయితే హీరోయిన్స్ కి అవకాశాలు పెరుగుతాయి. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ కి అవకాశాలు వెనక్కి వెళ్లిపోతాయి. నిజం చెప్పాలంటే ఒక సినిమా హిట్ కావడంలోగానీ .. ఫ్లాప్ కావడంలో గాని వాళ్ల పాత్ర ఎంతమాత్రం ఉండదు. ఎందుకంటే కథలో వాళ్ల పాత్ర హిట్ పై .. ఫ్లాప్ పై ప్రభావం చూపే స్థాయిలో ఉండదు. హీరోయిన్ అందంగా .. ఆకర్షణీయంగా ఉండాలి. కాస్త అభినయం తెలిసి ఉండాలి. ఇంతవరకూ మాత్రమే మేకర్స్ ఆలోచన చేస్తారు. ఆడియన్స్ మాత్రం అందంగా ఉండటమే హీరోయిన్ కి ఉండవలసిన ప్రధానమైన అర్హతగా భావిస్తారు. యాక్టింగ్ కూడా చేస్తే ఓకే అనేస్తారు.

ఒకటి రెండు భాషలు తెలిసిన హీరోయిన్లు అరడజను భాషల్లో నటించడానికి కారణం అదే. వాళ్ల నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఆశించేది గ్లామర్ మాత్రమే. గ్లామర్ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు పెద్దగా అభ్యంతరాలు చెప్పరు గనుకనే, ఎక్కువగా వాళ్లని దింపుతుంటారు. అలా అనన్య పాండే కూడా ‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ బాట పట్టింది. ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ అనన్య జోరు కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ నిన్న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.  గ్లామర్ పరంగా ఆమెకి పడిన మార్కులు కూడా తక్కువే.

ఈ సినిమాలో అనన్య తన పాత్ర పరిధిలో చాలా ఈజ్ తోనే చేసింది. కాకపోతే చాలా చిన్నపిల్లలా కనిపించింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కండలు పెంచడంతో, అతని జోడిగా ఈ అమ్మాయి మరింత సన్నగా .. పీలగా అనిపించింది. ముఖ్యంగా డాన్సుల సమయంలో మరీ బక్కపలచగా కనిపించింది. విశాలమైన కళ్లతో విన్యాసాలు చేయడానికి ట్రై చేసిందిగానీ, కాస్త బొద్దుగా ఉంటే బాగుండేదేమో అనిపించకమానదు. షో కేస్ లో బొమ్మ మాదిరిగా జీరో సైజ్ తో ఉంటే బాలీవుడ్ ఆడియన్స్ కి ఓకే గానీ, ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ నుంచి అవకాశాలు రావాలంటే కాస్త ఒళ్లు చేయాల్సిందే. ఓ సక్సెస్ పడేలా చూసుకోవలసిందే.

Also Read : కసితో బయల్దేరి .. చివర్లో దారి తప్పిన ‘లైగర్’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్