Sunday, February 23, 2025
Homeసినిమాఅనసూయ 'ఫ్లాష్ బ్యాక్' డబ్బింగ్

అనసూయ ‘ఫ్లాష్ బ్యాక్’ డబ్బింగ్

Anasuya Dubbing For Her Role In Flash Back :

ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాను అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై P. రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. డాన్ శ్యాండీ దర్శకత్వం వహిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథను తెర పై ఆవిష్కరించబోతున్నారు.

చిత్రంలో రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తుండగా.. అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరి రోల్స్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయి. అనసూయ రోల్ హైలైట్ కానుందని, ప్రభుదేవా క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఇక ఈ చిత్రానికి శ్యామ్ CS అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో అసెట్ అని అన్నారు.

షూటింగ్ పూర్తి చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. మొదట అనసూయ డబ్బింగ్ స్టార్ట్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీకి నందు దుర్లపాటి మాటలు రాశారు. సరికొత్త పాయింట్‌తో తమ సినిమా అందరినీ ఆకట్టుకోవడమే గాక పక్కాగా సక్సెస్ సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు దర్శకనిర్మాతలు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Also Read : అనుష్కను రెజీనా మరిపిస్తుందా?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్