Saturday, January 18, 2025
Homeసినిమా‘పుష్ప’ షూట్ లో ప్రవేశించిన రంగమ్మత్త

‘పుష్ప’ షూట్ లో ప్రవేశించిన రంగమ్మత్త

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ తో ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ఈ సంవత్సరం చివరిలో పుష్ప ఫస్ట్ పార్ట్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. విడుదల తేదీ పై షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే క్లారిటీ వస్తుంది. ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి రికార్డ్ వ్యూస్ రావడం.. ఇది బన్నీ పస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో యాంకర్ అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే. గురువారం అనసూయ పుష్ప షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. పుష్ప లోకేషన్ పిక్ ని అభిమానులతో పంచుకుంది. బ్యాక్ టు వర్క్.. పుష్ప అని పోస్ట్ చేసింది. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా పాత్రకు న్యాయం చేసింది. అందుకనే అనసూయ అంటే.. రంగమ్మత్త పాత్రే గుర్తొస్తుంటుంది. అంతలా నటించింది కాబట్టే సుకుమార్ మరో అవకాశం ఇచ్చారు. రంగస్థలం లాగే పుష్పలో కూడా కీలక పాత్రే పోషిస్తుంది అంటున్నారు. అయితే.. పుష్పలో ఎలాంటి పాత్ర చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్