Sunday, January 19, 2025
Homeసినిమాజూన్ 1న ‘పక్కా కమర్షియల్’ నుంచి అందాల రాశీ పాట

జూన్ 1న ‘పక్కా కమర్షియల్’ నుంచి అందాల రాశీ పాట

Andala Rasi:  ‘ప్ర‌తిరోజు పండ‌గే’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించిన సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం.

ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని అందాల రాశీ పాట జూన్ 1న విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

Also Read : జులై 1న గోపీచంద్ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్