Sunday, January 19, 2025
Homeసినిమాయంగ్ హీరోయిన్స్ కి అనిఖ సురేంద్రన్ గట్టిపోటీనే!

యంగ్ హీరోయిన్స్ కి అనిఖ సురేంద్రన్ గట్టిపోటీనే!

టాలీవుడ్ కి వివిధ భాషల నుంచి కొత్త హీరోయిన్స్ పరిచయమవుతూనే ఉన్నారు. అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చినవారు ముందుకు దూసుకువెళుతున్నారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై సందడి చేస్తున్న ముద్దుగుమ్మలలో కృతి శెట్టి .. శ్రీలీల కనిపిస్తున్నారు. ఇద్దరూ కూడా మంచి గ్లామరస్ హీరోయిన్సే. మొదటి సినిమాతోనే యూత్ కి కనెక్ట్ అయినవారే. ఇక ఇద్దరూ మంచి డాన్సర్స్ కావడం కూడా వారి కెరియర్ కి ప్లస్ అయింది.

ఒక వైపున శ్రీలీల .. మరో వైపున కృతి శెట్టి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ ఇద్దరి తరువాత స్థానంలో మరో కథానాయిక కనిపించడం లేదు. కేతిక శర్మ ట్రై చేసింది గానీ .. పాపం సక్సెస్ పడలేదు. ఈ నేపథ్యంలోనే అనిఖ సురేంద్రన్ ఎంట్రీ ఇస్తోంది. ఈ కేరళ పిల్ల చైల్డ్ ఆర్టిస్టుగా అక్కడ బాగా పాప్యులర్. ఆ తరువాత తమిళ సినిమాలను కూడా లైన్లో పెట్టేసి, టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ అమ్మాయి కళ్లలోనూ .. అభినయంలోనూ ఏదో తెలియని గ్రేస్ కనిపిస్తూ ఉంటుంది. అదే యూత్ కి కనెక్ట్ అయింది.

తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా మంచి మార్కులు కొట్టేసిన అనిఖ, ఇప్పుడు టీనేజ్ లవ్ స్టోరీస్ కి కరెక్టుగా సరిపోయే ఏజ్ లో ఉంది. దాంతో ప్రేమకథల స్పెషలిస్టులంతా ఆమె వెనుక పడుతున్నారు. అలా తెలుగు నుంచి వెళ్లిన కథనే ‘బుట్టబొమ్మ’. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. చిన్న సినిమానే అయినా పెద్ద బ్యానర్లో పరిచయమవుతోంది. బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న ‘అవికా’ ఇక్కడ హీరోయిన్ గా నిలబడలేకపోయింది. అనిఖ మాత్రం ఇక్కడి యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : అందరికీ నచ్చేలా ఉంటుంది : అనిక సురేంద్రన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్