Saturday, January 18, 2025
Homeసినిమారామ్ మూవీలో బాలీవుడ్ హీరో?

రామ్ మూవీలో బాలీవుడ్ హీరో?

హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంక‌ర్’ త‌ర్వాత  చేసిన రెడ్, వారియ‌ర్ చిత్రాలు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ అందివ్వ‌లేదు. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే.. స‌క్సెస్ సాధించాల‌ని ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో  ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే, ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏంటంటే.. ఇందులో రామ్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే.. ఇందులో రామ్ ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ కోసం బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అనిల్ క‌పూర్ ని కాంటాక్ట్ చేశార‌ని తెలిసింది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రానుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంద‌ట‌.

అందుకే.. అనిల్ కపూర్ కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని టాక్. రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట.

Also Read : బోయ‌పాటి సినిమాలో ఇద్దరు రామ్ లు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్