Sunday, February 23, 2025
Homeసినిమా'మాచర్ల నియోజకవర్గం' నుండి అంజలి లుక్ రిలీజ్

‘మాచర్ల నియోజకవర్గం’ నుండి అంజలి లుక్ రిలీజ్

Anjali Hot: యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ లో మరో గ్లామర్ క్వీన్ చేరి మరింత గ్లామరస్ గా మారుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఒక స్పెషల్ సాంగ్ కోసం అంజలిని తీసుకున్నారు. నేడు అంజలి లుక్ ని విడుదల చేశారు.  హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ పాత చిత్రీకరించారు.

టీమ్ రెగ్యులర్ గా ప్రమోషనల్ స్టఫ్ విడుదల చేస్తుంది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో ఉన్నత నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ , అనల్ అరసు భారీ యాక్షన్ పార్ట్స్ ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లని డిజైన్ చేస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్