Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఖేలో ఇండియాలో అంజనీ కుమార్ కు సిల్వర్

ఖేలో ఇండియాలో అంజనీ కుమార్ కు సిల్వర్

Silver for AP: అండర్-18 (బాలురు మరియు బాలికల) విభాగములో ఈ నెల 3వ తేది నుండి నేడు 13 వ తేదీ వరకు హర్యానాలో జరుగుతోన్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 లో భాగముగా చివరి రోజు ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారుడు అంజనీ కుమార్ రెండో స్థానంలో నిలిచాడు. బాక్సింగ్ అండర్ 18 బాలుర ఫైనల్ రౌండ్లో 63.5-67 కేజీల విభాగంలో అంజనీకుమార్ చండీఘర్ క్రీడాకారుడు అచల్వీర్ తో పోటీపడి 2-3 తో రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా శాప్ విసి & యండి డా. నక్కల ప్రభాకర రెడ్డి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. విజేతలకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్