తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అలవి కాని హామీలు ఇస్తోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చే పేరుతో తన వారికి ప్రజాధనం దోచిపెట్టేందుకు ఇప్పుడే ప్రణాలికలు సిద్దం చేశారు. బాబు హామీల్లో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే అన్న క్యాంటిన్ మళ్ళీ పునఃప్రారంభం చేస్తామని ప్రకటించారు.
జనాభాలో అత్యధికం పేదలే ఉన్నారు. ఒక అన్నా కేంటిన్ సుమారు 300 మందికి మాత్రమే భోజనం అందించగలదు. ఉదాహరణకు గతంలో రాజమండ్రిలో నాలుగు లేదా ఐదు కేంటిన్లకు మించి ఏర్పాటు చేయలేదు. మొత్తం కేంటిన్ లు పేదలకు అందించిన బోజనం రోజుకు ఇంచుమించు 1500 లోపు మాత్రమే. మిగిలిన పేదల పరిస్థితి ఏమిటి. వారికి అన్నాకేంటిన్ భోజనం అందలేదు.
సమాజంలో పేదలు అందరూ అన్నకేంటిన్ లలో భోజనం చేసి జీవనప్రమాణాలు మెరుగు పరచుకుంటున్నారన్న చందంగా ప్రచారం తారా స్దాయిలో జరిగింది. వాస్తవానికి… తెలుగు తమ్ముళ్ళ ప్రచారానికి ఎంతో వ్యత్యాసం.. ప్రచారంలో ఎక్కువశాతం అంటే 90 శాతంపైగా అవాస్తవం.. లక్షల సంఖ్యలో పేదలు ఉంటే వందల సంఖ్యలో బోజనాలు అందించి ..పేదలందరి ఆకలి తీర్చామని ప్రచారం చేసుకోవడం ఎంతవరకూ సమంజసం.
క్యాంటీన్ ల నిర్వహణ ఇస్కాన్ లాంటి స్వచ్చంద సంస్థలకు కొన్ని చోట్ల అప్పగించి ఎవరికీ అనుమానం రాకుండా పార్టీ నేతలు దండుకునేందుకు అనువుగా విధివిదానాలు రూపొందించాలని ప్రణాళికలు రూపొందించారు. గతంలో ఇదే తరహాలో వీటిని నిర్వహించారు. తాజాగా ఎన్నికల తంతు ముగియక ముందే ఎవరికి ఎక్కడ కట్టబెట్టాలో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది.
చంద్రబాబు అండ్ కో ఇలాంటి ప్రణాళికలు అనేకం సిద్దం చేశాయని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో అస్మదీయులకే ప్రభుత్వ పథకాలు అందేలా కుట్రలు చేశారనే విమర్శ ఉంది. అన్న క్యాంటిన్ ల పేరుతో ప్రజాధనం తెలుగు తమ్ముళ్ళకు దోచిపెట్టడం మానుకొని… నిరుపేదల సంక్షేమానికి నిజాయితీగా నిలబడి ఉంటే చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆప్పటి వ్యవహారాలపై మళ్ళీ చర్చ జరుగుతోంది.
ఈ దఫా కూడా అవే హామీలతో ఆర్భాటం చేస్తున్న చంద్రబాబుకు ప్రజల నుంచి భంగపాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-దేశవేని భాస్కర్