Saturday, January 18, 2025
Homeసినిమా ప్ర‌భాస్, మారుతి మూవీ అప్ డేట్

 ప్ర‌భాస్, మారుతి మూవీ అప్ డేట్

ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ అని టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటో షూట్ ని ఇప్పటికే పూర్తి చేసిన మారుతి ప్రస్తుతం ప్రభాస్ పై టెస్ట్ షూట్ ని మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘సలార్‘ ప్రాజెక్ట్ కే షూటింగ్ లతో బిజీగా వున్న ప్రభాస్, మారుతి సినిమాని ఐదు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాడట. సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్ మధ్య లభించిన బ్రేక్ టైమ్ ని మారుతి సినిమాకు ఉపయోగించబోతున్నాడట.

ఎప్పుడు ఈ రెండు సినిమా మధ్య బ్రేక్ లభిస్తే అప్పుడు మారుతి సినిమాకు కేటాయిస్తూ ఐదు నుంచి ఆరు నెలల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్టుగా స‌మాచారం. ఈ మూవీలోని కీలకమైన తాత పాత్రలో నటుడు బోమన్ ఇరానీ నటించే అవకాశం వుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు హీరోయిన్ లు నటించనున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. మారుతి ప్ర‌భాస్ ను ఎలా చూపిస్తాడో..?  ఏ స్థాయి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.

Also Read బిల్లా 4K స్పెషల్ ట్రైలర్ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్