Saturday, January 18, 2025
Homeసినిమా'సర్దార్'తో కార్తి మరో హిట్ కొట్టినట్టే!

‘సర్దార్’తో కార్తి మరో హిట్ కొట్టినట్టే!

కార్తి  హీరోగా రూపొందిన ‘సర్దార్’ తమిళ .. తెలుగు భాషల్లో ఒకే రోజున విడుదలైంది. ‘ఖాకీ’ .. ‘ఖైదీ’ సినిమాలతో కార్తికి ఇక్కడ మార్కెట్ పెరిగింది. మొదటి నుంచి తెలుగు ఆడియన్స్ తో టచ్ లో ఉండటం వలన, ఆయనను తమిళ హీరోగా ఇక్కడి ప్రేక్షకులు చూడరు. అందువలన ఏ మాత్రం కంటెంట్ బాగున్నా, ఆ సినిమాలు వెంటనే కనెక్ట్ అవుతుంటాయి. అలా ఆమె మంచి బలమైన కంటెంట్ తో వచ్చిన ‘సర్దార్’ తమిళంలోనే కాదు .. తెలుగులోను హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ‘సర్దార్’ తో పాటు మరో మూడు సినిమాలు రంగంలోకి దిగినప్పటికీ, కంటెంట్ పరంగా ‘సర్దార్’ ఎక్కువ మార్కులు కొట్టేసిందని చెప్పాలి.

‘సర్దార్’ లో తండ్రీ కొడుకులుగా కార్తి ద్విపాత్రాభినయం చేశాడు. గతంలో తండ్రీ కొడుకులుగా చాలామంది హీరోలు చేశారు. కానీ ఈ కథ నేపథ్యం వేరు. గ్రామీణ ప్రాంతంలో స్టేజ్ నాటకాలు వేస్తూ సరదాగా కాలం గడిపేసే చంద్ర బోస్ (కార్తి) .. అవినీతిపరుల ఆటకట్టించే ‘సర్దార్’ గా ఎలా ఎదిగాడనేది ఒక అంశం. తన తండ్రి దేశ ద్రోహి అనే మాటనే చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన విజయ్ (కార్తి), ఒక పోలీస్ ఆఫీసర్ గా తండ్రి నిజాయితీని ప్రత్యక్షంగా ఎలా తెలుసుకున్నాడు అనేదే కథ. ఈ రెండు ట్రాకుల మధ్య ఒక తల్లీ (లైలా) కొడుకుల ఎమోషన్ నడుస్తూ ఉంటుంది. ఆ పిల్లాడి పాత్రను ఈ రెండు పాత్రలకి లింక్ చేయడం ఆసక్తిని రేకెత్తించే మరో అంశం.

 సినిమాలో సీనియర్ కార్తి సరసన రజీషా విజయన్ .. జూనియర్ కార్తి జోడీగా రాశి ఖన్నా కనిపిస్తారు. అయితే ఈ ఇద్దరి హీరోయిన్స్ వైపు నుంచి కూడా దర్శకుడు రొమాన్స్ ను రాబట్టే ప్రయత్నం చేయలేదు. ఎంతవరకూ ఆ పాత్రలు అవసరమో అంతవరకే వాడుకోవడం జరిగింది. రొమాన్స్ .. కామెడీ కోణాలను టచ్ చేయకపోయినా, ఆడియన్స్ కి ఆ ఆలోచన రానీయకుండా  టైట్ స్క్రీన్ ప్లే తో కథ నడుస్తూ ఉంటుంది. ‘సర్దార్’ టైటిల్ కి తగినట్టుగా ఆ పాత్ర ఇంట్రడక్షన్ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. రాథోడ్ (చుంకీ పాండే) విలనిజం కూడా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. ఈ కథ ద్వారా ఇచ్చిన మెసేజ్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. మొత్తానికి కార్తి ఖాతాలో మరో మంచి సినిమా పడినట్టే!

Also Read : నాగార్జున సపోర్ట్ ని మర్చిపోలేను – కార్తి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్