Sunday, September 8, 2024
Homeసినిమాప్రభాస్, మారుతి మరో సినిమా చేయనున్నారా..?

ప్రభాస్, మారుతి మరో సినిమా చేయనున్నారా..?

ప్రభాస్, మారుతి కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాని అనౌన్స్ చేయలేదు కానీ.. సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఓ వైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ మరో వైపు మారుతి కోసం డేట్లు కేటాయించి సినిమాని త్వరగా పూర్తి చేయాలి అనుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే… ప్రభాస్.. మారుతి వర్కింగ్ స్టైల్ నచ్చడంతో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా వీరిద్దరి మధ్య అగ్రిమెంట్ కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. అసలు మారుతితో ఒక సినిమా చేయడమే అభిమానులు జీర్ణించుకోలేదు.. అలాంటిది ఇప్పుడు రెండో సినిమా కూడా చేయడం అంటే ఇది నిజమా అని నమ్మలేకపోతున్నారు. అయితే.. మారుతితో చేస్తున్న రిలీజ్ తర్వాత నెక్ట్స్ మూవీ గురించి ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు.

సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోలు ఎవరూ అలా చేయడం లేదు. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మంచి సమయం చూసి ప్రభాస్, మారుతి కాంబో మూవీని ప్రకటిస్తామని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పారు. ఇక ప్రభాస్, మారుతి కాంబో రెండో మూవీ గురించి ప్రకటించాలి అంటే కాస్త టైమ్ పట్టచ్చు. ఎందుకంటే ప్రభాస్ వరుసగా కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తవడానికి టైమ్ పడుతుంది. అందుచేత మారుతితో ప్రభాస్ సెకండ్ మూవీ చేయాలి అనుకున్నా.. ఇప్పట్లో ఉండకపోవచ్చు అని టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్