Sunday, January 19, 2025
Homeసినిమాజపాన్ లో మరో రికార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్

జపాన్ లో మరో రికార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్

రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కించిన మరో సంచలన చిత్రం. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్లో ఈ భారీ మల్టీస్టారర్ మూవీని ప్రకటించినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీని జపాన్ లో ఇటీవల రిలీజ్ చేశారు. అయితే.. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ టైమ్ రిలీజ్ అయినప్పుడు ఎలాగైతే ప్రమోషన్స్ చేశారో.. జపాన్ లో రిలీజైనప్పుడు కూడా అలా ప్రమోషన్స్ చేశారు.

ఈ ప్రమోషన్స్ కు తగ్గట్టుగానే ఫలితాన్నే అందుకుంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ఎంత ప్లస్ అయ్యిందో కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. హై ఎమోషనల్ అండ్ యాక్షన్ కంటెంట్ ఉన్నవాటిని మాత్రమే ఎక్కువగా ఆదరించే జపాన్ లో రామరాజు, కొమరం భీమ్ ల కథ ఏ మేరకు కనెక్ట్ అవుతుందోననే అనుమానాలు బద్దలు కొడుతూ సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటిదాకా ఆ దేశంలో విడుదలైన ఇండియన్ సినిమాల్లో అత్యంత వేగంగా 300 మిలియన్ యెన్లను దాటేసిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డు సృష్టించింది.

అది కూడా కేవలం ముప్పై అయిదు రోజుల లోపే. థియేటర్లో నమోదు చేసుకున్న ఫుట్ ఫాల్స్ అక్షరాలా 2 లక్షల 3 వేల 867. అంటే ఇంత మంది జక్కన్న మాయాజాలాన్ని చూసేందుకు టికెట్లు కొన్నారు. ఇదింకా కొనసాగుతోంది. పైరసీ జాడే ఉండని జపాన్ లో పాజిటివ్ టాక్ వచ్చిన మూవీస్ కి చాలా లాంగ్ రన్ ఉంటుంది. బాహుబలి 2 సుదీర్ఘ కాలం ఆడింది. ఇప్పుడు ఎంత లేదన్నా ఆర్ఆర్ఆర్ ఇంకో నెల రోజులు కొనసాగడం ఖాయం. టాప్ వన్ పొజిషన్ లో ఉన్న రజినీకాంత్ ముత్తుని దాటేందుకు ఆర్ఆర్ఆర్ కావాల్సింది కేవలం 100 మిలియన్ యెన్లు. మరి.. ఫుల్ రన్ లో ముత్తు రికార్డ్ ను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్