Saturday, July 27, 2024
Homeసినిమామే 7న 'సొట్ట బుగ్గల్లో' సాంగ్ విడుదల

మే 7న ‘సొట్ట బుగ్గల్లో’ సాంగ్ విడుదల

Sotta Buggallo: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ భారీ చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది. ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ ‘బుల్ బుల్ తరంగ్’ పాట విడుదలైన చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఆకట్టుకుంది. ఈ పాటలో రవితేజ తనదైన శైలిలో హుషారుగా కనిపించి, డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్స్ తో కూల్ అండ్ క్లాస్ గా అలరించారు. సింగింగ్ సంచలనం సిద్ శ్రీరాం వాయిస్ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ రోజు ఈద్ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. రవితేజ ఒక మసీదు ముందునుండి తన అంబాసిడర్ కారు వైపు ఫుల్ ఎనర్జీటిక్ గా నడుచుకుంటూ రావడం ఈ పోస్టర్ లో కనిపిస్తుంది.

పోస్టర్ లో రవితేజ లుక్ సూపర్ ఫిట్ గా అభిమానులని అలరించింది. ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ సొట్ట బుగ్గల్లో మే 7న విడుదల కానుంది. ఈ పాట అదిరిపోయే డ్యాన్సింగ్ సాంగ్ గా అలరించబోతుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ”రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read :  ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుండి ఫస్ట్ సాంగ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్