Sundaram coming: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికీ!’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నాని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వివేక్ ఆత్రేయ చివరి సన్నివేశానికి సంబంధించిన సీన్ పూర్తి చేసిన తర్వాత సినిమా షూటింగ్ పూర్తయ్యిందని అనౌన్స్ చేశారు. దాన్ని తన మొబైల్ కెమెరాలో చిత్రీకరించారు నాని. తర్వాత యూనిట్ సభ్యులందరితో కలిసి ‘అంటే.. సుందరానికీ!’ అంటూ గట్టిగా చెప్పారు. ఈ వీడియో చూస్తుంటే సినిమాను పూర్తి చేయడంపై యూనిట్ హ్యపీనెస్ను మనం గమనించవచ్చు.
మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి ఎంటర్టైనింగ్ మూవీస్ అందించి వరుస విజయాలను సాధించిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలున్నాయి. అదీ కాకుండా ఈ ఏడాది ‘శ్యామ్ సింగరాయ్’తో నాని మరో హిట్ సొంతం చేసుకున్నారు. ‘అంటే.. సుందరానికీ!’ సినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : నాగచైతన్య థ్యాంక్యూ లేటెస్ట్ అప్ డేట్