Sunday, January 19, 2025
HomeTrending NewsVarahi Yatra: ఇది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్

Varahi Yatra: ఇది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్

పెడనలో అల్లర్లకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాచారం ఎవరిచ్చారని పోలీసులు అడుగుతున్నారని, కానీ గతంలో తాను మంగళగిరి వస్తుంటే కోర్టుకు వెళ్తున్నానన్న సమాచారం వచ్చిందంటూ తన ఫ్లైట్ ఆపరు,  మీకు ఆ  సమాచారం ఎవరిచ్చారో  చెప్పాలని  జన సేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పెడనలో జనసేన వారాహి విజయ యాత్ర బహిరంగ  సభలో పవన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అప్పుడే సిఎం జగన్ కు సినిమా టిక్కెట్ రేట్లు, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ముందే పర్యావరణం, ఫ్లెక్సీలు గుర్తొస్తాయి. అవి కాగానే షరామామూలే
  • వైసీపీ నవరత్నాలకు జరిగేదానికి పొంతన లేదు, ఓట్లు వేయించుకొడానికి నవరత్నాలు అని మోసంచేశారు, వైసీపీ ప్రభుత్వం రూపాయి పావలా ప్రభుత్వం
  • దోపిడి, దాడులు చేస్తున్న వైసీపీని గద్దె దింపెలా, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైసీపీని తన్నితరిమేలా, ఓట్లు చీలకుండా చూసి వైసీపీని ఓడిద్దాం
  • జగన్ నీకు దమ్ము ఉంటే కేంద్రం దగ్గరకి వెళ్లి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ , రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అడుగు
  • పెడనలో ఇక్కడి ప్రజా ప్రతినిధి లంచాలు ఎలా తీసుకుంటున్నారో చెప్పారు.  కొత్త పాస్ బుక్ కావాలి అంటే 10 వేలు; రొయ్యల చెరువులో కొత్త ట్రాన్స్ ఫార్మర్ కోసం 2 లక్ష్లలు, అది కూడా ఆయన చెప్పిన షాప్ లో కొనాలి. ఆ ఆక్వా ఫీడ్ షాపు ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే 2-3 లక్షల లంచం ఇవ్వాలట
  • ఉపాధి హామీ పథకంలో అత్యంత అవకతవకలు జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మంత్రి సాద్వి నిరంజన్ గారు  చెప్పారు. నిధులు మళ్లించారు, కార్మికుల పొట్ట కొట్టాడు ఈ పెద్ద మనిషి.
  • జాతీయ ఉపాధి పథకం క్రింద 337 కోట్లు మళ్ళించాడు. కేవలం 6.22 కోట్ల డబ్బు మాత్రమే ఖర్చు జరిగింది, మిగతావి దారి మళ్లించారు.
  • 2014 లో బీజేపీ – టీడీపి కూటమికి మద్దతు పలకడానికి కారణం ఒక 10 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం. కొన్ని పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు, ఇప్పుడు మరోసారి కలిసి వస్తున్నాం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని కోరుతున్నాను.
  • Also Read: Mulakhat: టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్
RELATED ARTICLES

Most Popular

న్యూస్