Sunday, January 19, 2025
Homeసినిమాఅనుపమకి ఇప్పట్లో ఢోకా లేనట్టే! 

అనుపమకి ఇప్పట్లో ఢోకా లేనట్టే! 

అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అవుతోంది. నాని … శర్వానంద్ .. రామ్ .. నిఖిల్ వంటి యంగ్ హీరోల జోడీ కడుతూ, తానేమిటనేది నిరూపించుకుంది. స్కిన్ షో చేయకుండా నటన ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. జయాపజయాల సంగతి అటుంచితే, అనుపమ మంచి ఆర్టిస్ట్ అనే పేరు మాత్రం తెచ్చుకుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ వంటివారి అభినందనలు అందుకుంది. ఈ జనరేషన్ హీరోయిన్స్ లో అనుపమ మంచి ఆర్టిస్ట్ అని దిల్ రాజు చెప్పడం విశేషం.

అనుపమకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫలానా తరహా పాత్రలను .. సినిమాలను మాత్రమే చేయాలని వారు కోరుకుంటున్నారు. అందువల్లనే ఆమె ‘రౌడీ బాయ్స్’ సినిమా ఒప్పుకున్నప్పుడు విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఆమె మరింత జాగ్రత్త పడుతూ వెళుతోంది. ఆ సినిమా తరువాత అంతా కూడా ఇక అనుపమ పనైపోయిందని అనుకున్నారు. ఆమె కూడా అలాగే అనుకుందేమో ఆ సమయంలో తమిళ .. మలయాళ సినిమాల వైపు వెళ్లింది.

అదృష్టం కొద్దీ అనుపమకు ‘కార్తికేయ 2′ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లను రాబట్టడం .. అనుపమ పాత్రకి గుర్తింపు రావడం జరిగింది. ఆమె కెరియర్లో 100 కోట్ల సినిమాగా అది నిలిచింది. ఆ తరువాత చేసిన ’18 పేజెస్’ కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. యూత్ లో ఆమె స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. ఇదే సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన ‘బటర్ ఫ్లై’ అనుపమ నటనలో సహజత్వానికి మరోసారి అద్దం పట్టింది. ఇలా వరుస సక్సెస్ లతో ఉన్న అనుపమకి మళ్లీ ఆఫర్లు పుంజుకుంటున్నటుగా తెలుస్తోంది. ఓ మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు. అదే నిజమైతే ఇప్పట్లో ఆమె కెరియర్ కి ఢోకా లేనట్టే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్