Monday, June 17, 2024
Homeసినిమా'కన్నప్ప'లో మెరవనున్న అనుష్క! 

‘కన్నప్ప’లో మెరవనున్న అనుష్క! 

మంచు విష్ణు నిర్మాతగా .. హీరోగా ‘కన్నప్ప’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నట్టు విష్ణు ముందుగానే చెప్పాడు. అందుకు తగినట్టుగానే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాలోకి ఆర్టిస్టులు వచ్చి చేరుతున్నారు. షెడ్యూల్ .. షెడ్యూల్ కి ఈ సినిమా భారీతనాన్ని పెంచుకుంటూ వెళుతోంది. మంచు ఫ్యామిలీకి సంబంధించిన బ్యానర్లో ఈ స్థాయి బడ్జెట్ తో నిర్మితమవుతున్న తొలి సినిమా ఇదే. న్యూజిలాండ్ లో ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడనే టాక్ ఒక్కసారిగా అంచనాలు పెంచింది. అలాగే కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ .. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ .. శాండల్ ఉడ్ నుంచి శివ రాజ్ కుమార్ .. మల్లూ ఉడ్ నుంచి మోహన్ లాల్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక పాత్ర కోసం నయనతార .. కంగనా రనౌత్ .. కృతి సనన్ పేర్లను పరిశీలించి, చివరిగా నయనతారని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో అంతా కూడా పార్వతీదేవిగా నయనతార కనిపించనుందని అనుకున్నారు.

ఇక ఇప్పుడు అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఒక కీలకమైన పాత్ర కోసం అనుష్కను ఎంపిక చేశారని అంటున్నారు. అయితే అనుష్క ఏ పాత్రలో కనిపించనుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శివుడిగా ప్రభాస్ కనిపిస్తే పార్వతీదేవిగా అనుష్క అయితేనే బాగుంటుందని అంతా అనుకునే మాట. ఎందుకంటే ఈ ఇద్దరి జోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది. అలాంటప్పుడు నయనతార ఏ పాత్రలో కనిపించనుందనేది సందేహాన్ని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో కన్నప్ప భార్య పాత్ర కూడా ముఖ్యమైనదే. మరి ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్