Saturday, January 18, 2025
Homeసినిమామెగాస్టార్ సరసన మెరవనున్న అనుష్క - త్రిష!

మెగాస్టార్ సరసన మెరవనున్న అనుష్క – త్రిష!

చిరంజీవి కథానాయకుడిగా రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఆయన 157 వ సినిమాకి వశిష్ఠ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఫాంటసీ టచ్ తో నడిచే కథ. అందువలన ఖర్చు ఒక రేంజ్ లోనే ఉంటుంది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అందువలన నిర్మాణ పరమైన విలువల విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సినిమాలో ముగ్గురుకి మించిన హీరోయిన్స్ ఉంటారనే ఒక టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా నిన్న మొన్నటి వరకూ నయనతార పేరు వినిపించింది. తెలుగులో చిరంజీవి .. బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన కనిపించడానికి నయనతార పెద్దగా ఆలోచన చేయదు. అందువలన ఆమె ఈ సినిమా చేయడం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే అనుష్క పేరు తెరపైకి వచ్చింది. యూవీ క్రియేషన్స్ తో ఉన్న అనుబంధం కారణంగా అనుష్క ఈ సినిమా చేయడానికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు  బలంగానే ఉన్నాయి.

ఇక ఆ తరువాత సినిమాను కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవిలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరిగిపోతున్నాయి. సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో  చిరంజీవి సరసన నయనతార .. కాజల్ వంటి వారు చేసేశారు. అందువలన ‘త్రిష’ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్రిష తెలుగు సినిమాకి దూరమై చాలాకాలమే అయింది. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఆమె గ్లామర్ ఎంత మాత్రం తగ్గలేదనే విషయాన్నీ నిరూపించింది. అందువలన ఆమెకి ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. అలాగే మెగాస్టార్ సినిమా నుంచి కూడా ఆఫర్ వెళ్లిందని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్