Tuesday, October 1, 2024
Homeసినిమాఅన్వేషి టాలీవుడ్ ను అల్లుకుపోయేలా ఉందే!

అన్వేషి టాలీవుడ్ ను అల్లుకుపోయేలా ఉందే!

ఈ మధ్య తెలుగులో ప్రతి సినిమాలోను ఐటమ్ నెంబర్ గా ఒక మాస్ మసాలా  సాంగ్ ఉండేలా చూస్తున్నారు. స్టార్  హీరోలకి సంబంధించిన సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ లో దాదాపు వేరే హీరోయిన్స్ నే తీసుకుంటున్నారు. ఆల్రెడీ సినిమాలో ఇద్దరు ముగ్గురు భామలు హీరోయిన్లుగా ఉన్నప్పటికీ, ఐటమ్ సాంగ్ కోసం మరో కథానాయికగాను తీసుకుంటున్నారు. ఇందుకోసం స్టార్ హీరోయిన్స్ కి పెద్ద మొత్తంలోనే పారితోషికాన్ని చెల్లిస్తూ ఉండటం విశేషం.

తమన్నా .. అంజలి ..  పాయల్ .. రెజీనా ఇలా చాలామంది స్పెషల్ సాంగ్స్ లో తమ జోరు చూపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రీసెంట్ గా ‘సీసా’ అంటూ సాగే ఐటమ్ నెంబర్ ఒకటి ఎక్కువగా వినిపిస్తోంది. ‘ఒకరికి నే తేనె సీసా .. ఒకరికి నే కల్లు సీసా .. అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా’ అంటూ చంద్రబోస్ రాసిన ఈ పాట, రవితేజ హీరోగా చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలోది. సామ్ సీఎస్ స్వరపరిచిన ఈ బాణీ ఇప్పుడు ఒక ఊపు ఊపేస్తోంది. ఈ పాటలో సొగసుల ఖిల్లాలా మెరిసిన బ్యూటీ పేరు అన్వేషి.

అన్వేషి మధ్యప్రదేశ్ కి చెందిన మోడల్. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంటుంటోంది. చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేస్తోంది. మొన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను చీరకట్టులో అందరి  చూపులను తన వైపుకు తిప్పుకుంది. స్టేజ్ పై ఇద్దరు కథానాయికలు ఉన్నప్పటికీ అందరి కళ్లు ఈ పిల్ల మీదే ఉన్నాయి. హంసలాంటి నెమలి అన్నట్టుగా కనిపిస్తూ, అమ్మాయి మంచి మాటకారి అనే మార్కులు కూడా కొట్టేసింది. ఈ పిల్లకి పెరుగుతున్న ఫాలోయింగ్ ను చూసిన మేకర్స్ .. ఆమె డేట్స్ కోసం హడావిడి పడుతున్నట్టుగా టాక్. ప్రత్యేకమైన పాత్రల్లోను .. ఐటమ్ నెంబర్స్ లోను ఈ అమ్మాయి భలేగా సెట్ అవుతుందనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్