Wednesday, March 26, 2025
HomeTrending Newsఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు, అనంతరం సభ వాయిదా పడుతుంది. స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఏసి) సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే బిల్లులు ప్రభుత్వం పెట్టబోతోంది, ఏయే అంశాలు చర్చించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటారు.

బిఏసి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులను మంత్రిమండలి ఆమోదించనుంది. బుధవారం, 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 16 న 2023-24 వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టనున్నారు.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 24 వరకు అసెంబ్లీ  సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్