Budget Sessions: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 25వరకూ నిర్వహించాలని బిఏసీ నిర్ణయించింది. మొత్తం 12 పని దినాలు సభ సమావేశం కానుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం అద్యక్షతన జరిగిన ఈ భేటీలో సిఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్; చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తరపున అచ్చెన్నాయుడు ఈ భేటీలో పాల్గొన్నారు.
రేపు మార్చి 8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాపం
9న గౌతమ్ మృతికి సంతాప సూచకంగా సభకు సెలవు
10న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
11న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక శాఖ మంత్రి
12,13 తేదీల్లో శని ఆదివారాలు సభకు సెలవు
14,15 తేదీల్లో బడ్జెట్ పై చర్చ
18 – హోళీ… 19, 20 తేదీల్లో శని, ఆదివారాలు సభకు సెలవు
16,17, 21,22,23, 24 తేదీల్లో బడ్జెట్ పద్దులు, డిమాండ్లపై చర్చ
25 ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
కాగా, సభలో 25 అంశాలపై చర్చ జరగాలని వైసీపీ ప్రతిపాదించింది. జిల్లాల విభజన, ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, గత ప్రభుత్వ తప్పిదాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, శాంతి భద్రతలు- అధికార విపక్షాల పాత్ర; అవినీతి నిర్మూలనపై చర్చ జరగాలని బిఏసీలో కోరింది.