Wednesday, June 26, 2024
HomeTrending News19 నుంచి అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు!

19 నుంచి అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయి. ఇటీవల జరిగిన  సాధారణ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండు రోజులు పాటుసమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. సభ్యుల ప్రమాణ స్వీకారం తో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లను ఎన్నుకోనున్నారు.

ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించనున్నారు. గవర్నర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీలో  ఆయన నేతృత్వంలో మిగిలిన ఎమ్మెల్యే లు ప్రమాణ స్వీకారం చేస్తారు.

దీని ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేపడతారు. స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు దాదాపు ఖరారైంది. ఒకవేళ ఈ పదవి జనసేనకు ఇవ్వాల్సి వస్తే అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ ఇచ్చే ఆలోచనలో బాబు ఉన్నారు. అయితే బుద్ధ ప్రసాద్ స్వభావ రీత్యా దూకుడుగా వ్యవహరించాలేరని అందుకే అయ్యన్న పాత్రుడే తగిన వ్యక్తి అవుతారని టిడిపి నేతలు బాబుకు చెప్పారని సమాచారం.  అయ్యన్నకు స్పీకర్ ఇస్తే డిప్యూటీ స్పీకర్ గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది.   ఈనెల 18న నూతన మంత్రివర్గం తొలిసారి భేటీ కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్