రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారం వెల్లడించారు. నామినేటెడ్ పదవుల కేటాయింపు భారత సామాజిక న్యాయ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పుగా అయన అభివర్ణించారు. రాజ్యాధికారంలో అణగారిన వర్గాలకు భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచి పోతారని కొనియాడారు.
స్పీకర్ ప్రెస్ మీట్ లోని ముఖ్యంశాలు:
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆ వర్గాలకు పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారు.
- రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన మొదటి ప్రభుత్వం.. మొదటి ముఖ్యమంత్రి జగన్
- ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం అమలులో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించారు.
- ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ నాయకుడు అయినా.. ఇది కరెక్టు కాదు అని చెప్పగలరా..?. సామాజిక న్యాయం పేరుతో చాలా రాజకీయ పార్టీలు ఇంతకాలం కేవలం మాటలకే పరిమితమయ్యాయి.
- సామాజిక న్యాయం అన్నది చాలా పార్టీలకు ఎన్నికల నినాదం అయితే.. ఈ ప్రభుత్వానికి సామాజిక న్యాయం అన్నది విధానంగా మారింది.
- బీసీలంటే భారతదేశ చరిత్రలో ఆది పురుషులు. మూల పురుషులు. అటువంటి బీసీలకు, పార్టీకి పనిచేసిన చివరి కార్యకర్తల వరకు గుర్తు పెట్టుకుని.. ఈరోజు వారందరికీ రాజకీయంగా ఉన్నతమైన పదవులు ఇచ్చారు.
- బీసీలు అంటే వెనుకబడిన తరగతులు వారు కాదు. బీసీలంటే సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వారు అని, దళితులను గుండెల్లో పెట్టుకుని, మైనార్టీలను అక్కున చేర్చుకుని.. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, పూలే కన్న కలలను నిజం చేస్తూ.. పరిపాలన సాగిస్తోన్న యంగ్ డైనమిక్ లీడర్
- రాజ్యాంగ ప్రకారం, ఆ వర్గాల దామాషా ప్రకారం, రాజ్యాధికారంలో అణగారిన వర్గాలకు భాగస్వామ్యం కల్పించిన తొలి ముఖ్యమంత్రిగా జగన్ శాశ్వతంగా నిలిచిపోతారు.
- ఇంత చేస్తున్నందుకు.. అణగారిన వర్గాలందరి తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
- వందేళ్ళ చరిత్ర తర్వాత రాష్ట్రంలో ఈ వర్గాలకు వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని దుర్వినియోగ పరుచుకోకుండా, చిత్తశుద్ధితో సేవ చేయాలి.
- వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిగా, అసెంబ్లీ స్పీకర్ గా రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని నూటికి నూరు పాళ్ళు అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి మరోసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.