ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్నాయి. ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ఐదేళ్ళ పదవీకాలంలో ఇవి చివరి సమావేశాలు. ఫిబ్రవరి మొదటివారం తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ రావొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో రాబోయే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించనుంది. సమావేశాలు ఐదురోజులపాటు జరిగే అవకాశం ఉంది.
సమావేశాలకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మౌఖిక సూచలను అందినట్టు తెలుస్తోంది. మరో వారంరోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ తాజా పదవీకాలంలో చివరి సమావేశాలు కావడంతో అందరి దృష్టి ఈ సభా సమావేశాలపై ఉంటుంది.