Sunday, January 19, 2025
HomeTrending Newsఢిల్లీకి ఏపీ బిజెపి నేతలు

ఢిల్లీకి ఏపీ బిజెపి నేతలు

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడడంపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వివిధ వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్తున్నట్లు సమాచారం. సోము వీర్రాజు వ్యవహారశైలి నచ్చకనే తాను పార్టీ వీడుతున్నట్లు కన్నా చెప్పడం తెలిసిందే. కన్నా బాటలో మరికొందరు నేతలు త్వరలో పార్టీ వీడే అవకాశం ఉందని వార్తలు రావడంతో… ఈ వలసలు నివారించాలని, దీనిపై వెనువెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది,

మరోవైపు, రాష్ట్రానికి చెందిన పలువురు బిజెపి నేతలు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జ్, కేంద్ర మంత్రి వి. మురళీధరన్ తో పాటు అందుబాటులో ఉన్న అగ్ర నేతలను కలవనున్నారు. సోము ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం జరుగుతోందని, ఆయన్ను వెంటనే మార్చాలని వారు కోరనున్నారు.

Also Read : Kanna Lakshminarayana : బిజెపికి కన్నా రాజీనామా, టిడిపిలో చేరిక!

RELATED ARTICLES

Most Popular

న్యూస్