Sunday, November 24, 2024
HomeTrending Newsఫిబ్రవరి10 నుంచి కళ్యాణమస్తు: ఏపీ కేబినెట్

ఫిబ్రవరి10 నుంచి కళ్యాణమస్తు: ఏపీ కేబినెట్

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం లబ్ధిదారులకు అందించనున్న సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేసింది. వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కళ్యాణ మస్తు పథకాలను అమలు చేయనుంది.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి నేడు సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియా సమావేశంలో వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య శాలల్లో స్పెషలిస్ట్ ల కొరత జీరో శాతానికి పడిపోనుందని, జాతీయ స్థాయిలో ఈ కొరత 60శాతం ఉండగా, మనరాష్ట్రంలో అది పూర్తిగా లేకుండా చేయడం సిఎం జగన్ కు వైద్య రంగంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ కు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి మండలి నిర్ణయాలు:

  • రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్  ఆమోదించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్
  • యూనివర్సిటీల్లో నాన్-టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయసును 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం
  • Jsw ఇన్ఫ్రా సంస్థకు రామయపట్నం పోర్టులో రెండు బెర్తుల కేటాయింపు, 250 ఎకరాల భూమిని మారిటైమ్ బోర్డు ద్వారా కేటాయింపు
  • పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం
  • కర్నూల్, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు కేబినేట్ ఆమోదం
  • అనకాపల్లి జిలా పూడిమడక వద్ద ఎనర్జీ పార్క్ ఏర్పాటు
  • రూ. 1.10 లక్షల కోట్లతో ఎన్ టి పి సి ప్రాజెక్ట్
  • మొదటి దశలో 30 వేలు, రెండో దశలో 31వేల మందికి ఉద్యోగాలు
  • వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు
  • బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 3,940కోట్ల ఋణం కోసం ఆమోదం
  • గ్రానైట్ కంపెనీల విద్యుత్ రాయితీలకు ఆమోదం
  • ఈ నెల 28న జగనన్న విద్యా దీవెన అమలు
  • రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ
  • 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధుల పోస్టుల భర్తీ
  • వివిధ జిల్లాల్లో పలు మండల కేంద్రాల మార్పుకు ఆమోదం
  • ఈ నెల 10 నుంచి కళ్యాణ మస్తు, 24న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, 28న జగనన్న విద్యా దీవెన
  • 6,500 కోట్లతో మార్చిలో ఆసరా పథకం
RELATED ARTICLES

Most Popular

న్యూస్