Saturday, January 18, 2025
HomeTrending Newsబడ్జెట్ కు ఏపి కేబినేట్ ఆమోదం

బడ్జెట్ కు ఏపి కేబినేట్ ఆమోదం

సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. 2021-22 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ఆమోదించింది. కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సిఎం జగన్, మండలిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడతారు.

11 గంటలకు శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత సాధారణ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అనంతరం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు, మండలిలో డిప్యుటీ సిఎం ధర్మాన కృష్ణ దాస్ ప్రవేశ పెడతారు.

కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా మంత్రివర్గం చర్చించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్