అమరావతి భూ కుంభకోణంపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర కేబినేట్ ఆమోదించినట్లు తెలుస్తోంది. నేడు సచివాలయంలో ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. మొత్తం 55 అంశాలు నేటి అజెండా లో ఉన్నాయి.
అమరావతి రాజధాని పరిధిలోని R-5 జోన్ లో 47వేల మందికి ఇళ్ళు నిర్మించడానికి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. నిన్నటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రతిపాదనలకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాల పథకానికి కూడా కేబినేట్ ఒకే చెప్పినట్లు సమాచారం. కాసేపట్లో కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు వివరించనున్నారు.