వృద్ధాప్య పెన్షన్ పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతుం ఇస్తోన్న రూ.2,500 నుంచి రూ.2,750కి పెన్షన్ పెంపుదలను కేబినేట్ ఆమోదించింది. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలులోకి వస్తుంది. 62.31 లక్షలమంది పెన్షన్ లబ్దిదారులకు మేలు జరగనుంది.
సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతనమంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ బెటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమాల లబ్ధిని ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా లబ్దిదారులకు అందించాలని సిఎం ఆదేశించినట్లు తెలిసింది. కాగా, గడప గడపకు కార్యక్రమంలో మంత్రులు తాము ఇన్ ఛార్జ్ లుగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో పాల్గొనాలని సిఎం సూచించారని సమాచారం.