Thursday, April 17, 2025
HomeTrending Newsపీఆర్సీ జీవోలకు కేబినేట్ ఆమోదం

పీఆర్సీ జీవోలకు కేబినేట్ ఆమోదం

ఉద్యోగుల కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలకు  రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ళకు పెంచుతూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీని తిరస్కరిస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు సమావేశం అవుతోన్న ఉద్యోగ సంఘాలు పీఆర్సీకి వ్యతిరేకంగా సమ్మె నోటీసు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, వారి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కేబినేట్ ఈ పీఆర్సీని యధాతథంగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి నేడు సమావేశమైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, పీఆర్సీ అమలు, ఉద్యోగుల ఆందోళన, సమ్మె నోటీసు తదితర అంశాలపై కేబినేట్ లో చర్చ జరిగినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్