Sunday, November 24, 2024
HomeTrending Newsఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ అయ్యారు. ఆయన్ను  జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  సీఐడీ చీఫ్‌గా ఫైర్ సర్వీసెస్ డీజీ సంజయ్‌కి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇటీవలే డీజీగా సునీల్‌ కుమార్‌ పదోన్నతి పొందారు. సునీల్‌ కుమార్ బదిలీ ప్రభుత్వ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.   వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పీవీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఉన్నారు. సీఐడీ అధికారులు ప్రతిపక్ష నేతల్ని తప్పుడు కేసులతో వేధిస్తున్నారని.. నిబంధనలకు విరుద్దంగా అరెస్టులు చేస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయితే హఠాత్తుగా ఆయనను బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతోంది. సాధారణం సీనియర్ అధికారులను బదిలీ చేస్తే.. పోస్టింగ్ ఇస్తారు. కానీ పీవీ సునీల్ ఒక్కరినే బదిలీ చేశారు.. పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీనికి కారణం ఏమిటన్నదానిపై అధికారవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్