Thursday, March 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఫైబర్ నెట్ తొలిరోజు విచారణ  

ఫైబర్ నెట్ తొలిరోజు విచారణ  

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో సిఐడి విచారణ నేటినుంచి మొదలైంది. ఈ కేసులో కీలక ఆధారాలు సిఐడి సేకరించింది. ప్రభుత్వ అధికారి, ఫైబర్ నెట్ మాజీ ఎండీ సాంబశివరావు, వేమూరి హరిప్రసాద్ మొదటిరోజు విచారణకు  హాజరయ్యారు. నోటీసులు అందుకున్న దుర్గా ప్రసాద్ నేడు గైర్హాజరయ్యారు.

హరిప్రసాద్ గత ప్రభుత్వానికి సాంకేతిక సలహాదారుగా వ్యవహరించగా, కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న అధికారి సాంబశివరావు డెప్యుటేషన్ పై కొంతకాలం ఏపీ ప్రభుత్వంలో పని చేశారు.  నేటి విచారణలో కొన్ని అంశాలపై సాంబశివరావును ప్రశ్నించారు.

సిఐడి అధికారులు తనను ఏమీ అడగలేదని, మళ్ళీ పిలుస్తామని, అప్పుడు విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారని హరిప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది తప్పుడు ఆరోపణ అని, ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున ఇంతకూ మించి ఏమీ చెప్పలేనని, విచారణ పూర్తయిన తరువాత దీనికి సంబంధించిన అన్ని విషయాలూ వెల్లడిస్తానని హరిప్రసాద్ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్