Sunday, June 14, 2026
HomeTrending Newsదీదీని అనర్హురాలిగా ప్రకటించాలి – బిజెపి

దీదీని అనర్హురాలిగా ప్రకటించాలి – బిజెపి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నామినేషన్ దాఖలు చేసేటపుడు అనేక విషయాలు వెల్లడించలేదని బిజెపి అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్ ఆరోపించారు. మమత బెనర్జీ మీద పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అఫిడవిట్ లో పొందుపరచలేదని కలకత్తాలో ఎన్నికల సంఘానికి ప్రియంక్ తిబ్రేవాల్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మమతను అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

భవానీపూర్ కి జరగబోయే ఉపఎన్నికలు న్యాయానికి – అన్యాయానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ప్రియాంక తిబ్రేవాల్ అభివర్ణించారు. భవానిపూర్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉపఎన్నికల్లో తాము పోటీకి దిగటం లేదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. సిపిఐ ఎం బరిలోకి దిగినా మారిన రాజకీయ పరిణామాలతో నామమాత్ర ప్రభావమే ఉంటుంది. దీంతో బిజెపి – తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది.

ఈ నెల 30వ తేదిన పోలింగ్ నిర్వహించి వచ్చే నెల మూడవ తేదిన ఫలితాలు వెల్లడిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular