Sunday, February 23, 2025
HomeTrending Newsగవర్నర్ తో సిఎం జగన్ భేటీ

గవర్నర్ తో సిఎం జగన్ భేటీ

Address the Assembly: రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలుసుకున్నారు. నేటి సాయంత్రం సతీమణి వైఎస్ భారతి తో కలిసి రాజ్ భవన్ కు వెళ్ళిన జగన్ గంటసేపు ఆయనతో బెహ్టీ అయ్యారు. మార్చి 7 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా లాంచనంగా ఆహ్వానం పలికారు.

ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్ విభజనకు సంబంధించన వివరాలను కూడా గవర్నర్ కు సిఎం వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుండి వినతులను స్వీకరించి ఆమోదయోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఆవిష్కరించనున్నామని సిఎం వివరించారు.

కాగా, మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలియజేస్తుంది. మార్చి 11న రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. నెలాఖరు వరకూ సమావేశాలు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్