Saturday, January 18, 2025
HomeTrending Newsచీఫ్ జస్టిస్ ను కలుసుకున్న సిఎం

చీఫ్ జస్టిస్ ను కలుసుకున్న సిఎం

ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో ఉన్న  భారత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మూడురోజుల పర్యటనలో భాగంగా నిన్న రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ చంద్ర చూడ్ నిన్నతిరుమలలో నేటి ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్, శ్రీకాళహస్తి ఆలయాలను కూడా ఆయన దర్శించుకున్నారు, అనంతరం విజయవాడ చేరుకొని నోవాటెల్ లో బస చేశారు.
సిఎం జగన్ ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం చీఫ్ జస్టిస్ ను కలుసుకొని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేసి సత్కరించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్