Saturday, April 5, 2025
HomeTrending Newsప్రధానిని కలిసిన సిఎం జగన్

ప్రధానిని కలిసిన సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గత రాత్రి దేశ రాజధానికి చేరుకున్న జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ప్రధాని నివాసానికి చేరుకొని దాదాపు 50 నిమిషాలపాటు  భేటీ అయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ప్రధానికి తెలియజేశారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని పిఎం దృష్టికి తీసుకు వెళ్ళారు.  ఈ నేపథ్యంలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని, కొంత పురోగతి సాధించినప్పటికీ, కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు.

ఈ పర్యటనలో భాగంగా  మధ్యాహ్నం  కేంద్ర‌మంత్రి భూపేంద్ర‌యాద‌వ్‌తోను,  రాత్రి 10 గంట‌ల‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సిఎం జగన్ భేటీ కానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్