Sunday, January 19, 2025
HomeTrending Newsరెండో విడత వైఎస్‌ఆర్‌ ఆసరాకు శ్రీకారం

రెండో విడత వైఎస్‌ఆర్‌ ఆసరాకు శ్రీకారం

మహిళా స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం రెండో విడతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టారు . ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమంలో రెండో విడత సొమ్మును పొదుపు సంఘాల అకౌంట్లలో జమ చేశారు. స్వయం సహాయక బృందాల్లోని ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.

నాడు పాదయాత్రలో వైఎస్ జగన్ 2019 ఏప్రిల్ 11 నాటికి అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా సంఘం పొదుపు ఖాతా ద్వారా అందిస్తానని హామీ ఇచ్చారు. సుమారు 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87,74 లక్షల అక్కచెల్లెమ్మలకు ఉన్న అప్పు నిల్వ రూ. 27,168 కోట్లను నాలుగు వాయిదాలలో చెల్లిస్తానని చెబుతూ ఇదే విషయాన్ని నవరత్నాల్లో కూడా చేర్చారు. అధికారంలోకి వచ్చాక వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి, ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత చెల్లింపును గత ఏడాది సెప్టెంబర్ 11న 6,792 కోట్లను మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమ  చేశారు.  నేడు రెండో విడతలో మరో 6,792 కోట్ల రూపాయలను వారి పొదుపు ఖాతాల్లో అక్టోబర్‌ 7 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు జమ చేయనున్నారు.

మహిళలు వారి జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా గత ఏడాది అమూల్, హిందూస్తాన్‌ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అలానా వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఏడాది అజియో – రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, మహేంద్ర – ఖేతి వంటి బహుళ జాతి సంస్ధలతో ఒప్పందాలు చేసుకుని మహిళలకు వ్యాపార మార్గాలు చూపి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో వారికి సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్దికి బాటలు వేస్తోంది ప్రభుత్వం.

అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక పథకాల సొమ్మును మహిళల అకౌంట్లలోనే జమ చేస్తున్నామని,  ఇళ్ళ పట్టాలు కూడా అక్కచెల్లెమ్మల పేరు మీదే అందిస్తోంది ప్రభుత్వం. నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయించడం, వృద్దాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణకు దిశ చట్టం, దిశ పోలీస్‌ స్టేషన్ల వంటి ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

RELATED ARTICLES

Most Popular

న్యూస్