Sunday, January 19, 2025
HomeTrending Newsనేడే ఏపీ- ఓడిశా సిఎంల భేటి

నేడే ఏపీ- ఓడిశా సిఎంల భేటి

AP Cm Jagan To Meet Odisha Cm To Discuss On Inter State Issues : 

ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్, ఓడిశా ముఖ్యమంత్రులు నేడు సమావేశం కానున్నారు.  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి సాయంత్రం భువనేశ్వర్ లో ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌ను కలుసుకొని చర్చలు జరపనున్నారు.  ఈ  నేపథ్యంలో క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం పలు శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సన్నాహక సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించారు. మూడు ప్రధాన అంశాలు…. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై నేటి సనావేశంలో జగన్ ప్రస్తావించనున్నారు.

సిఎం జగన్  సన్నాహక సమావేశం ముఖ్యాంశాలు:

  • వంశధారపై నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను నవీన్ వివరించనున్న సీఎం.
  • బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్‌బెడ్‌ ప్రాంతమేనన్న అధికారులు
  • బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని తెలిపిన అధికారులు
  • జంఝావతి ప్రాజెక్టు అంశాన్ని రేపటి సమావేశంలో ప్రస్తావించనున్న సీఎం.
  • ప్రస్తుతం రబ్బర్‌ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని తెలిపిన అధికారులు.
  • 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని తెలిపిన అధికారులు
  • ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని తెలిపిన అధికారులు
  • ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిపిన అధికారులు.

  • ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తెలిపిన అధికారులు. ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని తెలిపిన అధికారులు.
  • ఆర్‌ అండ్‌ ఆర్‌కు సహకరించాలని ఒడిశాను కోరనున్న ఏపీ.
  • కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను సీఎం ముందు ఉంచిన అధికారులు
  • కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలను వివరించిన అధికారులు.
  • 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని సీఎంకు వివరించిన విజయనగరం జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి
  • ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో పేర్కొన్న అధికారులు
  • కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించిన అధికారులు

ఈ సమావేశంలో సీఎస్‌ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్‌సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read :

9న ఏపీ, ఓడిశా సిఎం ల భేటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్