CM Review: అమరావతి రాజధాని, పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు వెలువరించిన తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమీక్షించారు. సమీక్ష సమావేశానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
అమరావతిపై హైకోర్టు తీర్పులో ఏముందో తెలియదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. తీర్పు పూర్తిగా చదివాక అన్ని విషయాలపై మాట్లాడతానన్నారు. హైకోర్టు తీర్పు తాము ఊహించిందేనని, అందులో కొత్తగా ఏమీ లేదని, పరిపాలన వికేంద్రీకరణకు ఈ క్షణం వరకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
త్వరలో మూడు రాజధానుల బిల్లు పెడతామని పునరుద్ఘాటించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలో లేదో చర్చించి చెబుతామన్నారు. చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయని బొత్స అభిప్రాయపడ్డారు.
Also Read : సిఆర్డీయే రద్దు చెల్లదు: హైకోర్టు ఆదేశం