Saturday, January 18, 2025
HomeTrending Newsవదంతులు నమ్మొద్దు: ఇంధన శాఖ

వదంతులు నమ్మొద్దు: ఇంధన శాఖ

దసరా పండుగ తర్వాత లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఖండించారు. దీనిపై నేడు ఓ ప్రకటన విడుదల చేశారు. బొగ్గు సరఫరా విషయంలో సంక్షోభం తలెత్తిన మాట వాస్తవమే అయినా వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

విద్యుత్ శాఖ ప్రకటన లోని ముఖ్యాంశాలు:

⦿బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్‌ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి.
⦿ ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయి
⦿ ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నాయి
⦿ సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించాం
⦿ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ  ఏపి జెన్కోకు బొగ్గు కొనుగోలు కోసం అత్యవసరంగా 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు
⦿ రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించబడ్డాయి
⦿ దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయాలని స్పష్టమైన సిఎం ఆదేశాలిచ్చారు.
⦿ ధరతో నిమిత్తం లేకుండా తక్షణ అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్‌ పంపిణి సంస్థలకు సూచించాం}
⦿ కేంద్ర సంస్థల నుంచి దాదాపు 400 మెగా వాట్లు చౌక ధర విద్యుత్‌ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాం
⦿ కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడటం జరిగింది
⦿ సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని మన రాష్ట్రంలో వున్న కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం  నిరంతర ప్రయత్నాలు ప్రారంభించాం
⦿ విటిపిఎస్‌, కృష్ణపట్నం కేంద్రాల్లో కొత్తగా 800 వెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ప్రారంభించడానికి, త్వరగా అందుబాటులోకి తేవటానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం

అంటూ ప్రకటనలో పేర్కొన్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్