అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి కరకట్టపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివసిత్స్తున్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేస్తున్నట్లు పేర్కొంది. గతంలో అమరావతి భూ సేకరణలో నాటి సిఎం చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణకు క్విడ్ క్రో కు పాల్పడి ఈ గెస్ట్ హౌస్ యజమాని లింగమనేనికి లబ్ది చేకూరేలా వ్యవహరించారని అభియోగం నమోదు చేసింది. స్థానిక జడ్జికి సమాచారం అందిస్తూ అటాచ్ మెంట్ ఉత్తర్వులు వెలువరించింది.
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో అవకవతకలు జరిగాయని, దానికి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని, చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా, సాధారణ ఆర్ధిక నియమాలను ఉల్లంఘించినట్టు నిర్ధారణకు వచ్చామని తెలియజేసింది. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని అభియోగంనమోదు చేసింది.