Friday, October 18, 2024
HomeTrending Newsమొగల్తూరులో కృష్ణంరాజు స్మృతివనం: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

మొగల్తూరులో కృష్ణంరాజు స్మృతివనం: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

ప్రముఖ నటుడు,  కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు మరణంతో ఆయన  అభిమానులు తీవ్ర  దిగ్భ్రాంతికి గురయ్యారు.  నేడు ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.

కాగా కృష్ణంరాజు పేరిట స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటా యిస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు.  మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజులతో కలిసి ఆమె ఈ సంస్మరణ సభకు హాజరయ్యారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ప్రభాస్ లను ఓదార్చారు.  రెబల్ స్టార్ మరణం సినీ,  రాజకీయ రంగాలకు తీరని  లోటని వారు విచారం వ్యక్తం చేశారు.

Also Read : కృష్ణంరాజు కుటుంబానికి రాజ్ నాథ్ పరామర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్