Sunday, February 23, 2025
HomeTrending Newsజస్టిస్ రమణ గౌరవార్ధం ఏపీ ప్రభుత్వ విందు

జస్టిస్ రమణ గౌరవార్ధం ఏపీ ప్రభుత్వ విందు

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గౌరవార్ధం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేడు విందు ఏర్పాటు చేసింది. విజయవాడలోని సికె ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వా భూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, న్యాయాధికారులు పాల్గొన్నారు.

సిఎం జగన్ దంపతులు, గవర్నర్ ను, జస్టిస్  రమణ దంపతులను సాదరంగా విందుకు ఆహ్వానించారు.

నేటి ఉదయం నుంచి జస్టిస్ రమణ పలు కార్యక్రమాలతో బిజీగా గడిపారు. తొలుత బెజవాడ బార్ అసోసియేషన్ నూతన భవన సముదాయం ప్రారంభోత్సవంలో సిఎం జగన్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆచార్య నాగార్జున  యూనివర్సిటీ లో తనకు ప్రకటించిన గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించారు. అనంతరం విందుకు హాజరయ్యారు.

Also Read : ఇదో అరుదైన ఘట్టం: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్