Monday, June 8, 2026
HomeTrending Newsజగనన్నవిదేశీ విద్యా దీవెన

జగనన్నవిదేశీ విద్యా దీవెన

Videshee Vidya: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు మరో పథకం ప్రవేశ పెట్టింది.  విదేశీ విద్యకోసం  జగనన్న విదేశీ విద్యాదీవెనకు రూపకల్పన చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు రూపొందించింది.  ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ దీన్ని వర్తించింది.

ఈ పథకం ముఖ్యాంశాలు:

  • క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును భరించనున్న ప్రభుత్వం
  • మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపు.
  • నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌
  • ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు
  • ఫస్ట్‌సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు
  • రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు
  • నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు
  • పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు
  • ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తింపు
  • టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా గుర్తింపు
  • ఏపీలో స్థానికుడై ఉండాలి, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు
  • ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్‌
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే ఎంపిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular