Tuesday, April 16, 2024
HomeTrending Newsకోయపోచగూడెంలో అడవి ఆక్రమించే యత్నం

కోయపోచగూడెంలో అడవి ఆక్రమించే యత్నం

గ్రామంలో ఇళ్లు, భూములు ఉన్నాకూడా, ఆటవీ భూమిని ఆక్రమించాలనే దురుద్దేశ్యంతో కోయపోచగూడలో కొందరు రాద్దాంతం చేస్తున్నారని మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివానీ డోగ్రా తెలిపారు. కోయపోచగూడకు ఆనుకుని ఉన్నదంతా కవ్వాల్ టైగర్ రిజర్వుకు చెందిన అటవీ భూమి మాత్రమే అని ఆమె అన్నారు. ఇటు అటవీ రికార్డుల్లో గానీ, అటు రెవెన్యూ రికార్డుల్లో గానీ ఇప్పటిదాకా అక్కడ పోడు భూమే లేదని డీఎఫ్ఓ తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, మాకులపేట పంచాయతీ, కోయపోచగూడెంలో ఫారెస్ట్ భూములను అక్రమిస్తున్నా, అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై దాడులకు పాల్పడుతూ అటవీశాఖ అధికారుల విధులను అడ్డుకుంటున్నారని మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ అధికారి శివాని డోగ్రా పేర్కొన్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రం, అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వాస్తవంగా కోయపోచగూడెంలో పోడు భూములు లేవని గతంలో ఎప్పుడూ అక్కడి వారు పోడు వ్యవసాయం చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. వాళ్లకు మాకులపేట గ్రామ పంచాయితీ పరిధిలో ఇండ్లు ఉన్నాయని, కొందరి ప్రోద్బలంతో ఫారెస్ట్ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆభూమి కవ్వాల్ అభయారణ్యంలో పరిధిలోకి వస్తుందని అక్కడ ఎప్పుడూ పోడు భూములు ఉన్నట్లు ఫారెస్ట్, రెవెన్యూ రికార్డులు లేవని తెలిపారు. అక్కడికి మహిళలని పంపించి పోడు భూముల పేరుతో ఫారెస్ట్ భూములను అక్రమించుటకు ప్రయత్నిస్తున్నారని అది చట్టరీత్యా నేరమని ఆమె పేర్కొన్నారు. ఆక్రమించాలంటూ ఇతరులు చెప్పే మాటలను వినొద్దని అన్నారు. కోయపోచగూడ పరిధిలో ఇప్పటిదాకా పోడు భూములు లేవన్న వాదనకు మద్దతుగా తగిన ఆధారాలను ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికైనా పోడు భూముల్లో అక్రమలకు పాల్పడ్డ వారు నిజాయితీగా అటవీశాఖ అధికారులకు సహకరించినట్లయితే భవిష్యత్తులో వారికి అక్కడ చేపట్టబోయే ఫారెస్ట్ పనుల్లో ఉపాధి కల్పిస్తామని డీఎఫ్ఓ తెలిపారు.

రెండవ సారి గుడిసెలు వేసుకున్నప్పుడు అటవీ, పోలీస్ శాఖలు తొలగించే క్రమంలో అటవీ శాఖ అధికారుల పై కారంపొడి, కర్రలతో దాడికి పాల్పడ్డారని కొంతమంది అటవీశాఖ అధికారులకు గాయాలు కూడా అయ్యాయని సమావేశంలో పాల్గొన్న జన్నారం డివిజనల్ ఫారెస్ట్ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు. మళ్లీ అదే రోజు రాత్రి మూడు గుడిసెలు వేశారని, వారు ఫారెస్ట్ భూముల్లో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆయన అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్