Saturday, April 20, 2024
HomeTrending Newsనేషనల్​ హెరాల్డ్​ కేసులో 21న సోనియా విచారణ

నేషనల్​ హెరాల్డ్​ కేసులో 21న సోనియా విచారణ

నేషనల్​ హెరాల్డ్​ కేసులో భాగంగా విచారణ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ దిరేక్టరేట్  తాజాగా మరోమారు సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడి తేల్చిచెప్పింది. వాస్తవానికి గత నెలలోనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరుకావాల్సి ఉంది. కానీ ఆమెకు కొవిడ్​ సోకడం, ఆ తర్వాత వచ్చిన అనారోగ్యం కారణంగా విచారణకు వెళ్లలేకపోయారు. విచారణ వాయిదా వేయాలని అమె చేసిన అభ్యర్థనకు అంగీకరించింది. ఈ క్రమంలో జులైలో విచారణకు రావాల్సి ఉంటుందని గత నెలలో వెల్లడించింది. తాజాగా.. తేదీని ప్రకటించింది. నేషనల్​ హెరాల్డ్​ కేసులో రాహుల్​ గాంధీని తీవ్రంగా విచారించింది ఈడీ. దాదాపు వారం రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది.

బ్రిటీష్​ రాజ్యంపై యుద్ధం కోసం 1938లో స్థాపించిన వార్తాపత్రికే ఈ నేషనల్​ హెరాల్డ్​. నాటి కాంగ్రెస్​ అధ్యక్షుడు జవహర్​లాల్​ నెహ్రూ.. ఈ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్​(అసోసియేటెడ్​ జర్నల్స్​ లిమిటెడ్​).. నేషనల్​ హెరాల్డ్​ పత్రికలను ప్రచురించేది. నేషనల్​ హెరాల్డ్​ వార్తాపత్రికలో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు షేరుహోల్డర్లుగా ఉండేవారు.

స్వాతంత్రం తర్వాత.. నేషనల్​ హెరాల్డ్​ను కాంగ్రెస్​ అన్ని విధాలుగా ఉపయోగించుకునేది. అనంతరం.. ఉర్దూ(కౌమి అవాజ్​), హిందీ(నవ్​జీవన్​)లోనూ నేషనల్​ హెరాల్డ్​ ఎదిగింది. దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. నేషనల్​ హెరాల్డ్​ ఛైర్మన్​ పదవి నుంచి నెహ్రూ తప్పుకున్నారు. క్రమంగా.. దేశంలో నేషనల్​ హెరాల్డ్​ ఉనికి కోల్పోతూ వచ్చింది. చివరికి 2008లో.. ఈ వార్తాపత్రిక మూతపడింది. అప్పటికే ఆ సంస్థకు రూ. 90.25కోట్ల అప్పులు ఉన్నాయి. అయితే.. అప్పులను తొలగించేందుకు.. కాంగ్రెస్​ పార్టీ.. నేషనల్​ హెరాల్డ్​కు రూ. 90.25కోట్లు ఇచ్చింది. అది కూడా రుణ రహిత అప్పులు ఇచ్చింది.

2009లో యూపీఏ మరోమారు అధికారంలోకి వచ్చింది. 2010లో.. యంగ్​ ఇండియా పేరుతో దేశంలో ఓ ఎన్​జీఓ ఆవిర్భవించింది.

యంగ్​ ఇండియాకు.. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ డైరక్టర్​గా ఉండేవారు. ఆయనతో పాటు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు మోతీలాల్​ వోరా, ఆస్కర్​ ఫెర్నాండేజ్​లు షేర్​హోల్డర్ బాధ్యతలు తీసుకున్నారు. 2010లో ఏజేఎల్​కు 1,057మంది షేర్​హోల్డర్లు ఉండేవారు. 2011లో ఒక్కసారిగా.. ఏజేఎల్​కు చెందిన అన్ని హోల్డింగ్స్​ను యంగ్​ ఇండియాకు బదిలీ చేసేశారు. ఏజేఎల్​.. యంగ్​ ఇండియాలో చేరింది. రూ. 90,25కోట్ల రుణం బదులు.. రూ. 50లక్షలను యంగ్​ ఇండియాకు చెల్లించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్​ హెరాల్డ్​ ఆస్తులన్నీ యంగ్​ ఇండియా వశమయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్