మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో పేద, మధ్యతరగతి గృహ నిర్మాణదారులకు ఉపశమనం కలిగించేలా ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 8నుంచి ఉచిత ఇసుకను ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను చంద్రబాబు ఆదేశించారు.
నిన్న మైనింగ్ పై సిఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి పునరుద్దరించాలని ఆ సమావేశంలోని ఓ నిర్ణయానికి వచ్చారు.
లోడింగ్, రవాణా చార్జీలను నిర్ణయించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తోంది.