Governor at Delhi: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశమయ్యారు. ప్రధాని నరెంద్రమోదీతో మొన్న సమావేశమైన గవర్నర్ నిన్న ఢిల్లీలోని వార్ మెమోరియల్ ను సందర్శిచారు.
నేటి మధ్యాహ్నం భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుసుకున్నారు. సాయంత్రం రాష్ట్రపతితో సమావేశమైన గవర్నర్ పలు అంశాలపై ఆయనతో చర్చించారు. కాసేపట్లో గవర్నర్ భారత ప్రధాన న్యాయమూర్తితో భేటీ కానున్నారు. గవర్నర్ భేటీలు మర్యాదపూర్వకమైనవే నని చెబుతున్నా ఇంత హఠాత్తుగా గవర్నర్ ఢిల్లీ లో క్రియాశీలం కావడం పలు అనుమానాలకు తావిస్తోందని మూడురోజులపాటు అయన టూర్ వెనుక వేరే ఇతర కారణాలు కూడా ఉంది ఉండొచ్చని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.