Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం జగన్ తో జపాన్ లో రోడ్ షోకు సన్నాహాలు

సిఎం జగన్ తో జపాన్ లో రోడ్ షోకు సన్నాహాలు

Industrialization: జపాన్ కోరుకునే పారిశ్రామిక వాతావరణానికి ఏపీ చిరునామాగా నిలుస్తుందని, రాష్ట్రంలోని జపాన్ కంపెనీల సీఈవోలతో త్వరలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది స్పష్టం చేశారు. జపాన్ కి చెందిన ప్రతినిధులు నేడు జవ్వాదిని కలిశారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జపాన్ లో రోడ్ షో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు అయన వారికి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ప్రతినిధులు  హామీ ఇచ్చారు. తగ్గట్లు త్వరలోనే పరస్పర అవగాహన ఒప్పందం దిశగా కలిసి ముందడుగు వేయనున్నట్లు వారు పేర్కొన్నారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలందించే  అంశంపై జపాన్ ప్రతినిధులు ప్రధానంగా సీఈవోతో చర్చించారు.

యొకొహమ పరిశ్రమ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భాగస్వామ్య మైందని జవ్వాది గుర్తు చేశారు. సిఎం జగన్ నైపుణ్యాభివరువృద్ధికి జగన్ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర యువతను పరిశ్రమలకు కావలసినట్లుగా తీర్చిదిద్దే ప్రణాళికతో ముందుకువెళుతున్న తీరు, విధానాలను వివరించారు. ఏపీలో నైపుణ్య వనరులకు కొదవ లేదని, స్కిల్ గ్యాప్ ఉన్నచోట పరిశ్రమలు కోరినట్లు ఉచిత శిక్షణ ఇచ్చి  తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జైకా, జెట్రో వంటి జపాన్ సంస్థలతో కలిసి ప్రయాణిస్తున్న విషయాన్ని ఈడీబీ సీఈవో ఈ సందర్భంగా వారికి వివరించారు.

శ్రీ సిటీకి 25 కి.మీ దూరంలో ప్రత్యేకంగా జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ (జిట్) ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకే ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ వెసులుబాటుతో పాటు శ్రీ సిటీలో జపనీస్ భాష అనువాదకులను కూడా ఏర్పాటు చేసినట్లు ప్రస్తావించారు.

భారత్ లో జపనీస్ కు చెందిన 1400 కంపెనీలు ఏర్పాటయ్యాయని ఎంయూఎఫ్ జీ బ్యాంకు చెన్నై బ్రాంచ్ అధ్యక్షులు హెడ్ యుకిహిరో వెల్లడించారు. దక్షిణ  భారత్ లో వాణిజ్యపరంగా ఏపీ అన్నింటికి అనువైన రాష్ట్రంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్